తమిళ స్టార్ హీరో సూర్యకి అమ్మాయిలలో మామూలు క్రేజ్ లేదు. సూర్య ప్రస్తుతం రెట్రో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే, సూర్యకి జంటగా నటిస్తుంది. అయితే ఇటీవలే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు జరిగాయి, ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  'నేను హీరో అవ్వాలనుకున్న రోజుల్లో మొదట కలవాలనుకున్నది హీరో సూర్యని. ఆయన్ని కలవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అయినా కుదరలేదు నేను ఆయనను కలవలేకపోయాను. ఇన్నేళ్ల తర్వాత ఈ వేదికపై ఆయనను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సూర్యని కలిసి నా జ్ఞాపకాలని పంచుకోవడం ఇంకెంతో ప్రత్యేకంగా ఉంది. సూర్య నటన ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తిని నింపుతుంది. ఆయన రకరకాల పాత్రలో నటించారు. విభిన్నమైన జోనర్లు ఎంచుకొని మరి నటించారు. అలాంటి పాత్రలు పోషించడానికి చాలా ధైర్యం కావాలి. మరోసారి ఆయన మన ముందుకు అద్భుతమైన సినిమాతో మే 1న రానున్నారు' అని రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అన్నారు. 

రెట్రో సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ సినిమా వచ్చే నెల 1న విడుదల కానుంది. రెట్రో మూవీతో హీరోయిన్ పూజా హెగ్డే,  హీరో సూర్య మంచి హిట్ అందుకుంటారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకెళ్తూ.. మరింత అంచనాలు పెంచుతుంది. ఇక సూర్య మళ్లీ లవ్ స్టోరీతో రావడంతో అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. రెట్రో సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే పాత్రలు చాలా కొత్తగా ఉంటాయని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా మంచి రికార్డ్ కొడుతుందని టాక్ కూడా వినిపిస్తుంది.

 
ఇకపోతే సూర్య అటు సినీ జీవితం.. ఇటు కుటుంబ జీవితం రెండు సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. సూర్య తెలుగుతో పాటుగా తమిళంలో కూడా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈయన తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగు అభిమానుల నుండి కూడా చాలా ప్రేమ, ఆధారణలు పొందారు.




మరింత సమాచారం తెలుసుకోండి: