
టాలీవుడ్ సీనియర్ హీరో .. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఫస్టాఫ్ స్క్రిఫ్ట్ పూర్తయ్యింది. చిరు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా సెకండాఫ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. వైజాల్‌లో అనిల్ రావిపూడి తన టీమ్ తో స్క్రిఫ్ట్ వర్క్ చేస్తున్నాడు. సెకండాఫ్ లో చిరంజీవి పాత్రకు స్పెషల్ యాస తో పాటు బాడీ లాంగ్వేజ్ ను అనిల్ రావిపూడి డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా లో కామెడీ పై అనిల్ బాగా కాన్‌సంట్రేషన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమా గురించి కొద్ది రోజుల క్రితం చిరంజీవి మాట్లాడుతూ సినిమా కంప్లీట్ గా కామెడీ తో ఉంటుందని.. ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టేందుకు తాను ఎంతో ఆసక్తి తో ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని తెలిపారు. ఇక ఈ సినిమా గురించి ఎన్నో ఇంట్రస్టింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. సినిమా లో చిరు ది డ్యూయల్ రోల్ అని ... అనిల్ రావిపూడి చెప్పే సీన్లు వింటుంటే అప్పుడే తాను పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వానని .. ఈ సినిమా అందరికి ఎంతో నచ్చుతుందని చిరు కాన్ఫిడెంట్ గా చెప్పారు. సాహు గారపాటి , సుస్మిత ( చిరంజీవి కుమార్తె ) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు