పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళ స్టార్ నటుడు తలపతి విజయ్ హీరోగా సమంత హీరోయిన్గా అట్లీ దర్శకత్వంలో రూపొంది అద్భుతమైన విజయం సాధించిన తేరి మూవీ కి రీమేక్ అని వార్తలు వచ్చాయి. తేరి సినిమా ఇప్పటికే తెలుగులో పోలీసోడు అనే పేరుతో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ అయినటువంటి దశరథ్ ఈ మూవీ తేరి సినిమాకు రీమేక్ కాదు అని , ఈ మూవీ కొత్త కథతో రూపొందుతుంది అని చెప్పాడు. దానితో ఈ మూవీ పై ఒక్క సారిగా పవన్ అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరిపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... పవన్ ఈ సినిమా కోసం ఏకంగా 170 కోట్ల పారితోషకం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా పవన్ ఈ సినిమా కోసం 170 కోట్ల పారితోషకం తీసుకున్నాడు అని వార్తలు బయటకు రావడంతో ఇది పవన్ క్రేజ్ ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇకపోతే చాలా కాలం క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్ పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉండడం వల్ల పలుమార్లు ఆగిపోయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్లో తిరిగి ప్రారంభించి , జెట్ స్పీడ్ లో ఈ మూవీ ని పూర్తి చేసి ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ఈ మూవీ బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: