
సరిగ్గా యేడాది క్రిందట టాలీవుడ్ లో సమ్మర్‌కు పెద్ద సినిమాలు వస్తాయనుకున్నా రాలేదు. అలా సమ్మర్ మొత్తం వేస్ట్ అయిపోయింది. థియేటర్లు అన్నీ ఖాళీ అయిపోయాయి. ఓ వైపు ఐపీఎల్ పోటీ ఉంది. ఇక ఈ యేడాది కూడా ఏప్రిల్ నెల అంతటా వేస్ట్ అయిపోయింది. ఈ సారి కూడా ఏప్రిల్లో మంచి సినిమాలు రాలేదు. విశ్వంభర సినిమా వస్తందనుకున్నా రాలేదు. హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి కూడా అంతే. గత యేడాది టిల్లూ స్క్వేర్ తో పాటు జూన్ చివర్లో వచ్చిన ప్రభాస్ కల్కి మినహా ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు. ఈ యేడాది ఫిబ్రవరిలో తండేల్ వచ్చింది.. సినిమా హిట్ అయినా అనుకున్నట్టుగా కలెక్షన్లు రాలేదు. ఇక మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. కోర్ట్ కూడా వచ్చింది. రెండు మంచి సినిమాలే కలెక్షన్లు యావరేజ్‌గానే వచ్చాయి.
ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతీ , ఓదెల 2 వచ్చాయి. రెండు సినిమాలకు పర్లేదు అన్న టాక్ ఉన్నా కనీసం 50 శాతం బ్రేక్ ఈవెన్ రాలేదు. ఇక జాక్ , గుడ్ బ్యాడ్ అగ్లీ , అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలు వచ్చినవి వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఇక ఈ నెలకు ఫినిసింగ్ టచ్ గా వచ్చిన సారంగపాణి జాతకం సినిమా కు టాక్ బాగున్నా ఓపెనింగ్స్ లేవు. ఇక సమ్మర్ లో రావాల్సిన రాజా సాబ్, కన్నప్ప సినిమాలు సైతం వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు ఆశలు అన్నీ వచ్చే హిట్ 3, కింగ్ డమ్ మీదే ఉన్నాయి. పవన్ వీరమల్లు వాయిదా పడడం నిరాశే అనుకోవాలి. ఏదేమైనా ఈ రెండు సినిమాలు కూడా హిట్ కాకపోతే 2025 సమ్మర్ టాలీవుడ్ లో పెద్ద డిజాస్టర్ అనుకోవాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు