టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇకపోతే చిరంజీవి తన కెరియర్లో ఎంతో మంది దర్శకులను కూడా రిపీట్ చేశాడు. కానీ చిరంజీవి ఒకే ఒక్క దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన 14 సినిమాల్లో నటించాడు. అందులో 2 సినిమాల్లో చిరంజీవి విలన్ పాత్రలో నటిస్తే , 12 సినిమాల్లో హీరో పాత్రలలో నటించాడు. ఇంతకు చిరంజీవి నటించిన 14 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆ దర్శకుడు ఎవరో తెలుసా ..? ఆయన మరెవరో కాదు దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు. మరి చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన ఆ 14 సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబినేషన్లో మొదటగా మోసగాడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ లో శోభన్ బాబు హీరోగా నటించగా , చిరంజీవి విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తిరుగులేని మనిషి అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిరంజీవిమూవీ లో రెండవ హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో అడవి దొంగ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో కొండవీటి రాజా అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.  ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో చాణక్య శబదం అనే మూవీ వచ్చింది. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వీరి కాంబోలో మంచి దొంగ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత చిరంజీవి , రాఘవేందర్రావు కాంబోలో యుద్ధ భూమి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వీరి కాంబోలో రుద్రనేత్ర అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత వీరి కాంబోలో జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీ వచ్చింది. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో రౌడీ అల్లుడు అనే మూవీ వచ్చింది.

సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో ఘరానా మొగుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. చిరు , రాఘవేంద్రరావు కాంబోలో ఆఖరుగా శ్రీ మంజునాథ సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: