గ‌త ఏడాది బ్యూటిఫుల్ ఎంటర్టైలర్ గా ఆడియన్స్‌ను పలకరించిన సినిమా ప్రేమలు . .. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాల‌నిపించే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. ఆడియన్స్‌కు అదే రేంజ్‌లో కనెక్ట్ అయింది. ఈ క్రమంలోనే సినిమాను బ్లాక్ బ‌స్టర్‌గా నిలిపారు. హీరోయిన్‌గా మమిత బైజు నటించి ఆకట్టుకుంది .. యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది. . ఈ క్రమంలోనే అమ్మడు టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. . . కాగా ఆమె తమిళ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  .ఈ క్రమంలోనే ఇప్పటికి పలు తమిళ్ సినిమాలు నటిస్తూ బిజీగా గడుపుతుంది .. .
 

ప్ర‌స్తుతం తమిళ్ సూపర్ స్టార్ల‌లో ఒకరైన విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న‌ జననాయగ‌న్‌ సినిమాలో బిజీగా గ‌డుపుతుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమా భ‌గ‌వంత్ కేస‌రి రిమేక్‌గా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇందులో శ్రీ‌లీల‌ పాత్ర కోసం మమిత బైజు నటించనుంద‌ని టాక్. ఇలాంటి క్రమంలో మమిత మరోసారి జాక్పాట్ ఆఫర్లు కొట్టేసింది. నేషనల్ కాదు. . .. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో అమ్మడు నటించబోతుందని టాక్ వైరల్ గా మారుతుంది.  అది మ‌రేదోకాదు తారక్, ప్రశాంత్‌ కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్. .

 

రీసెంట్‌గా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించిన ఈ సినిమాలో మమిత ఓ కీలక పాత్రలో మెరవనుందట. అదే వాస్తవం అయితే అమ్మడుకు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ ఇప్పటికే ఫిక్స్ అయింది . .. మ‌మితా బైజు మరో హీరోయిన్గా నటించనుందా.. . లేదా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ లో మరువనుందా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది . ..

మరింత సమాచారం తెలుసుకోండి: