మహేష్ బాబు ఈ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఈ హీరో తనకంటూ ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రాజకుమారుడు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకున్నారు. మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. 


ఇక మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం "ఎస్ఎస్ఎంబి 29". ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమా 2027 సంవత్సరంలో రిలీజ్ కానుందని రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమాలలో మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తారు.


ఇప్పటివరకూ మహేష్ బాబు ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. అంతేకాకుండా యాడ్స్ షూటింగ్ లలోను మహేష్ బాబు చురుగ్గా పాల్గొంటారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ సురాన అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అందువల్ల మహేష్ బాబు ఈ సంస్థ నుంచి భారీగా డబ్బులను తీసుకుంటున్నారని అనేక రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మహేష్ బాబుకు ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు. మహేష్ బాబును ఈడి విచారణకు రేపు హాజరు కావాలని అధికారులు కోరారు.

దీంతో మహేష్ బాబు ఈ విషయం పైన స్పందిస్తూ ఈడి అధికారులకు లేఖ రాశారు. తాను ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నానని రేపు విచారణకు హాజరు కాలేకపోతున్నారని మహేష్ బాబు అన్నారు. విచారణకు మరో తేదీ ఇవ్వాలంటూ లేఖ ద్వారా ఈడి అధికారులకు మహేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: