టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి సినిమా చేస్తున్నారంటే ఇక ఆ సినిమా పైన ఎలాంటి అంచనాలు ఏర్పడతాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు తను తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా విజయాలను అందుకున్నాయి. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం గురించి రాజమౌళి ఒక అదిరిపోయే అప్డేట్ ఇవ్వడం జరిగింది. హీరో నాని ,డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న హిట్ 3 సినిమా ఫంక్షన్ లో నిన్నటి రోజున రాజమౌళి అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మహాభారతం గురించి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది రాజమౌళి.


యాంకర్ సుమ మాట్లాడుతూ.. రాజమౌళి ని రిక్వెస్ట్ చేస్తూ మహాభారతం చిత్రంలో నాని ఉంటాడా అని ప్రశ్నించగా? అందుకు రాజమౌళి స్పందిస్తూ.. హీరో నాని కి ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది తప్పకుండా మహాభారతం లో నాని ఉంటాడనే విషయాన్ని తెలియజేశారు. దీంతో అభిమానులు అయితే కొంతమేరకు ఆనంద పడుతున్నారు. అయితే పాత్ర ఏంటి అనేది చెప్పలేదు..అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో గ్లోబల్ స్థాయిలో సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు.


సినిమా అయిపోయిన తర్వాతే మహాభారతం చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉన్నది. హిట్ 3 చిత్ర మే ఒకటవ తేదీన ప్రేక్షకుల మందికి రాబోతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ను  సైతం వేగవంతం చేస్తున్నారు. నానికి జోడిగా హీరోయిన్ శ్రీ నిది శెట్టి నటిస్తోంది. అలాగే బ్రహ్మాజీ ,సూర్య శ్రీనివాస్ ,రావు రమేష్ తదితర నటి నటుడు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గడిచిన కొద్దిరోజుల క్రితం ట్రైలర్ ని కూడా విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాకుండా టాప్ లో వ్యూస్ ని రాబట్టింది. ఈ సినిమాలు ఈసారి ఫుల్ వైలెన్స్ గా ఉండబోతుందనే విధంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: