
అయితే అదంతా ఫేక్ అంటూ అనుష్కకి సంబంధించిన వ్యక్తులు ఇటు ప్రభాస్ కి సంబంధించిన వ్యక్తులు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంటారు. కాగా ఓ విషయంలో ప్రభాస్ చెప్పిన విషయాన్ని వినకుండా అనుష్క పెద్ద తప్పు చేసింది అన్న విషయాన్ని ఫాన్స్ మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. అది మరేంటో కాదు "సైజ్ జీరో" మూవీ . సైజ్ జీరో మూవీ కోసం ఆమె బరువు పెరగాలి అంటూ డిసైడ్ అయింది . అయితే చాలామంది ఈ రిస్కీ పనులు చేయొద్దు అంటూ ఆమెకు సజెస్ట్ చేశారు . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ బొద్దుగా మారిపోతే అవకాశాలు తగ్గిపోతాయి అన్న విషయం అందరికీ తెలుసు . అదే విషయాన్ని స్వీటీకి చాలా మంది దగ్గర వ్యక్తులు చెప్పారు .
మరీ ముఖ్యంగా ప్రభాస్ ఈ ప్రాజెక్టు వద్దు వద్దు అని నెత్తి నోరు మూసుకున్నారు. కానీ అనుష్క వినలేదు. ప్రతి ఒక్క విషయాన్ని చాలా డిఫరెంట్గా ఆలోచించే అనుష్క సైజ్ జీరో కోసం బరువు పెరిగింది . ఈ సినిమా హిట్ కాకపోగా ఆమెకు ఫుల్ తలనొప్పులు క్రియేట్ చేసింది . ఈ సినిమా కోసం పెరిగిన బరువును తగ్గడానికి చాలా చాలా టైం తీసుకుంది . ఇప్పటికి అనుష్క ఆ బరువు తగ్గలేకపోతుంది . దీంతో ప్రభాస్ చెప్పిన మాట వినుంటే బాగుండేదిగా అంటూ రెబెల్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. అనుష్కకి ఇప్పటికి మంచి ఆఫర్స్ రాకపోవడానికి కారణం ఆమె బరువే అన్న సంగతి అందరూ మాట్లాడుకుంటున్నారు..!!