టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి శ్రీలీల ఒకరు. ఈ చిన్నది తెలుగు సినీ ఇండస్ట్రీకి పెళ్లి సందడి సినిమాతో పరిచయమైంది. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలలో అవకాశాలను పొందింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీ లీల చేతి నిండా సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

చిత్ర పరిశ్రమలోనే  శ్రీలీల అగ్ర హీరోయిన్ల జాబితాలో ఒకరిగా నిలవడం విశేషం. ప్రస్తుతం ఈ చిన్నది అత్యధిక రెమ్యునరేషన్ వసూలు చేస్తున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అంతేకాకుండా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో కూడా  శ్రీలీల ఉండడం విశేషం. ఇక శ్రీలీల మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గతంలోనే శ్రీలీల ఇద్దరు గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వారి కుటుంబంలోకి మరో పాప వచ్చిందని అర్థం వచ్చేలా శ్రీ లీల సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ను షేర్ చేసుకున్నారు.

ఆ పాపని ఎత్తుకొని శ్రీలీల ముద్దు పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక శ్రీలీల గతంలో ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకొని వారి ఆలనా పాలనను తానే చూసుకుంటుంది. ఇప్పుడు మరో అమ్మాయిని దత్తత తీసుకోవడంతో శ్రీలీల మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. శ్రీలీల మంచితనాన్ని చూసి తన అభిమానులు మెచ్చుకుంటున్నారు. నటిగా మాత్రమే కాకుండా శ్రీలీల తల్లిగా కూడా తన గొప్ప మనసును చాటుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీలకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: