జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . అలాంటి ఒక స్టార్ స్టేటస్ తన పేరుకి దక్కించుకున్నాడు . చాలామంది స్టార్ అయ్యాక తమ పేరుకి పాపులారిటీ వస్తుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ కాకముందే ఆయన పేరుకి పాపులారిటీ వచ్చేసింది. స్వర్గియ నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఆయనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు.  కాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఓల్డ్ న్యూస్ మళ్లీ నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చింది .


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత వార్తలను కూడా సరికొత్తగా ట్రెండ్ చేస్తుంది ఇంటర్నెట్.  ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఇలాగే ట్రెండ్ అయ్యాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సీన్ చేయడానికి ఇబ్బంది పడిన విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటుంది సోషల్ మీడియా.  దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ వార్తను తెగ ట్రెండ్ చేస్తున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా సింహాద్రి . ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆయన కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టింది .



ఆయన పర్ఫామెన్స్ .. ఆయన నటన .. ఆయన డ్యాన్సింగ్ స్టైల్.. ఆయన అమాయకత్వం ఈ సినిమాలో బాగా అబ్జర్వ్ చేయొచ్చు . అయితే ఈ సినిమాలో ఒక సీన్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడ్డారట జూనియర్ ఎన్టీఆర్.  మరి ముఖ్యంగా భూమికతో అలా ఆ సీను నటించడానికి ఏకంగా మూడు రోజులు పాటు టైం తీసుకున్నారట.  సింహాద్రి సినిమాలో అంకిత జూనియర్ ఎన్టీఆర్ ల పర్ఫామెన్స్ కన్నా.. భూమిక జూనియర్ ఎన్టీఆర్ ల పర్ఫామెన్స్ హైలెట్గా మారింది అని చెప్పుకోవడంలో సందేహం లేదు.



వీళ్ళిద్దరి కాంబోలో ఓ సాంగ్ ఉంటుంది. "నన్నేదో చేయమాకు" ఈ సాంగ్ కొరియోగ్రఫీ మూమెంట్లో తారక్ సరదాగా భూమిక నడుము గిల్లాలి..  అయితే మొదటి నుంచి హీరోయిన్స్ తో లిమిటెడ్ గా బిహేవ్ చేసే తారక్ కి ఇది పెద్దగా నచ్చలేదు . కంఫర్టబుల్గా లేదు . ఆఖరికి భూమిక వచ్చి పర్వాలేదు ఆసీన్ చేయమని చెప్పినా కూడా తారక్ వినలేదట.  అసలు ఆ సీన్ చేయడానికి మూడు రోజులపాటు నానా తిప్పలు పెట్టారట . ఇక తారక్ ప్రాబ్లం అర్థం చేసుకున్న రాజమౌళి ఆ సాంగ్ లో ఆ మూమెంట్ ని క్యాన్సిల్ చేసేసారట . అంత సిగ్గు గల వ్యక్తి అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: