టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ సింగర్ ప్రవస్తి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఈమె మాటలతో చాలామంది సింగర్స్ బయటికి వచ్చి మరీ కీరవాణి, సునీత,చంద్రబోస్ లు  అలాంటివారు కాదు అని చెప్పే పరిస్థితి ఏర్పడింది.అయితే సింగర్ ప్రవస్తి ఎలిమినేట్ అయ్యాను అనే ఉద్దేశంతో అలా మాట్లాడిందో లేక వీరిని బ్లేమ్ చేయాలని అలా మాట్లాడిందో తెలియదు కానీ ప్రవస్తి చేసిన కామెంట్లు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోని మ్యూజిక్ డైరెక్టర్ లపై, సింగర్స్ పై పెద్ద మచ్చ తీసుకొచ్చి పెట్టాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ ప్రవస్తి చేసిన రచ్చ వైరల్ గా మారుతున్న వేళ తాజాగా కీరవాణికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ వీడియోలో ఏముందంటే.. కీరవాణి ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్లోకి కొత్తగా వచ్చే సింగర్లకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది.

కానీ ఈ క్యాస్టింగ్ కౌచ్ అనే పదమే సమాజానికి పట్టిన ఒక రుగ్మత వంటిది. ఈ ఆలోచన వచ్చినా కూడా అది పాపమే.దొంగ దొరికితేనే దొంగ లేకపోతే దొర అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ ఇలాంటి ఆలోచనలు మైండ్ లోకి వస్తే వాళ్ళు దొంగ గానే పరిగణించబడతారు. అలాగే మ్యూజిక్ రంగంలో కూడా కొత్తగా వచ్చే సింగర్స్ పై ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అనడానికి కారణం సినిమాలోని కొన్ని సన్నివేశాలలో మ్యూజిక్ డైరెక్టర్లు కొత్త సింగర్లని లైంగిక వేధింపులకు గురిచేస్తారు అనే సన్నివేశాలను ఎక్కువగా చూపించడంతో జనాల్లోకి అది అలాగే వెళ్ళిపోయింది.అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో లేదు అని మాత్రం నేను చెప్పలేను ఉంది.. కొత్తగా వచ్చే వారికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి.

అసలు ఏ రంగంలో అయినా కూడా ఇలాంటి వారు ఉంటారు. అసలు మన ప్రపంచంలో ఇలాంటి ఆలోచనలు లేని వారు ఎవరైనా ఉన్నారా అని వెతికితే కనీసం 10 శాతం మంది కూడా కనిపించరు. అయితే అన్ని రంగాలలో ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది కానీ సినిమా రంగంలోనే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది బయటికి ఎక్కువగా వినిపిస్తుంది. అయితే కొంతమంది దీన్ని బయటపెట్టరు. మరికొంతమంది బయటపెడతారు.. అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో సంచలనం వ్యాఖ్యలు చేశారు కీరవాణి. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు సింగర్ ప్రవస్తి మాట్లాడిన మాటలకు కీరవాణి మాట్లాడిన మాటలకు లింకప్ చేస్తూ కీరవాణి స్వయంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ రంగంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది కాబట్టి ప్రవస్తి చెప్పిన మాటలు నిజమే కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: