మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... త్రిష ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని చాలా కాలం క్రితం మొదలు పెట్టారు. ఈ సినిమాను మొదలు పెట్టాక ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు పెండింగ్ ఉండే అవకాశాలు ఉండడంతో ఈ మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయడం లేదు అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కానీ ఈ సినిమాను ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇక ఆ తేదీన చిరంజీవి హీరోగా రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడంతో ఆ తేదీన విశ్వంభర మూవీని విడుదల చేయనున్నట్లు వార్తలు రావడంతో విశ్వంభర సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని మెగా ఫాన్స్ ఆశించారు. కానీ విశ్వంభర మూవీ మే 9 వ తేదీన కూడా విడుదల కాపడం కష్టం అని ఈ సినిమా జూలై నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని వార్తల్లో రావడంతో మెగా ఫాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు.

ఇకపోతే మే 9 వ తేదీన చిరంజీవి హీరోగా రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: