సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్స్ స్థానం శాశ్వతం కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే . కానీ కొందరు హీరోయిన్స్ ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి కూసింత  టైం పడుతుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వచ్చే హీరోయిన్స్ ఓవర్గా ఇండస్ట్రీలో బీహేవ్ చేస్తున్నారని చెప్పుకోవడంలో సందేహమే లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అయిందో మారుమ్రోగిపోయిందో అందరికీ తెలిసిందే. రష్మిక బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడంతో ఎక్కడ చూసినా రష్మిక రష్మిక రష్మిక అంటూ జనాలు మాట్లాడుకున్నారు .


రష్మిక మందన్నాలేకపోతే ఇండస్ట్రీలో ఇక హీరోలకి హీరోయిన్లే దొరకరు అన్న రేంజ్ లో మాట్లాడుకున్నారు . ఇంకా ఎక్కువ గానే మాట్లాడుకున్నారు. అయితే సికందర్ సినిమా ఫ్లాప్ తో మళ్ళీ అంత మునుపటిలా వచ్చేసింది. మూడు సినిమాలు హిట్లు  అందుకున్న రష్మిక మందన్నా నాలుగో సినిమా ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది . దీనితో రష్మికపై నెగిటివిటీ ఏర్పడింది . అయితే మెల్ల మెల్లగా రష్మిక స్థానాన్ని రీప్లేస్ చేస్తుంది మరో హీరోయిన్ అంటూ సినిమా ఇండస్ట్రీలో టాక్ మొదలైంది . ఆమె మరి ఎవరో కాదు "మమిత బైజు".



రష్మిక మందన్నా లా చాలా సింపుల్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమాతోనే మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది.  అయితే రష్మిక మందన్నా  ఏ విధంగా తన స్ట్రాటజీతో ముందుకు వెళ్లిందో ఇప్పుడు మమిత బైజు కూడా అలాగే ముందుకు వెళుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమాలో మమిత బైజు వన్ ఆఫ్ ద హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతుంది.  రష్మిక కూడా ఇలానే సైలెంట్ గా బిగ్ బిగ్ సినిమాలలో ఆఫర్స్ పట్టేసింది అని .. ఇప్పుడు రష్మిక స్థానాన్ని రీప్లేస్ చేస్తే స్థాయికి మమిత వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు జనాలు . చూద్దాం మరి మమిత బైజు త్వరలోనే నేషనల్ క్రష్ స్ధానాని ఆకుపై చేస్తుందేమో..??

మరింత సమాచారం తెలుసుకోండి: