న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం నాని హిట్ 3 సినిమాతో త్వరలో థియేటర్ లో రిలీజ్ కానుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మూవీకి శుభవార్త చెప్పింది. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  తాజాగా దీనికి సంబంధించిన జీవోని కూడా విడుదల చేసింది. ఇక ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో టికెట్ ధర రూ. 50, మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర రూ. 75 పెంచుకోమని స్పష్టం చేసింది.
 
హీరో నాని ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి. దీంతో మే 1న హిట్ 3తో హీరో నాని ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు.

 
మేలో హిట్ 3 సినిమా విడుదల ఉండడంతో మూవీ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో హీరో నాని చాలా వైల్డ్ గా ఉంటారని.. మూవీ మొత్తం రక్త పాతంతో నిండి ఉంటుందని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. హిట్ 3 సినిమా రిలీజ్ కి ముందే ఒక డిఫరెంట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన నాని ఇప్పుడు మాస్ రోల్ లో మళ్లీ కనిపించనున్నారు. ఫ్యాన్స్ అందరూ మాస్ పాత్రలో నాని పాత్రని మరోసారి చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులకు హిట్ 3 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోసారి నాని హిట్ కోడతాడాని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: