కొంతమంది హీరోల భార్యలు తమ భర్తలను వలలో వేసుకున్న హీరోయిన్లపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో మీడియా ముఖంగానే మాట్లాడుతూ ఉంటారు. అయితే అప్పట్లో ఓ హీరోయిన్ ని రోడ్డు మీదే కొడతాను అంటూ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతే కాదు ఆమె జీవితం నాశనం అవుతుందని నా ఉసురు తగులుతుంది అని ఓ ఇంటర్వ్యూలో మీడియా ముఖంగానే చెప్పింది.మరి ఇంతకీ ఆ హీరో భార్య ఎవరో మీకు ఇప్పటికే గుర్తొచ్చి ఉంటుంది. ఆమెనే ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా భార్య రమాలత్.. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రభుదేవా రమాలత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ముగ్గురు కొడుకులు పుట్టారు.

 వీరిలో ఒక అబ్బాయి క్యాన్సర్ కారణంగా మరణించారు. అయితే సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి నయనతార ఎంట్రీ ఇవ్వడంతో రమాలత్ ప్రభుదేవా మధ్య గ్యాప్ పెరిగి నయనతారతో ప్రేమలో పడ్డారు ప్రభుదేవా. అలా నయనతార ప్రభుదేవా అప్పట్లో పెళ్లి చేసుకోవడానికి కూడా ఫిక్స్ అయ్యారు. ఇక ఆ టైంలో నయనతారని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది ప్రభుదేవా మొదటి భార్య రమాలత్. ఆమె జీవితం సర్వ నాశనం అవుతుందని,నా ఉసురు తగులుతుందని, కనిపిస్తే రోడ్డుమీదే కొడతానంటూ రమాలత్ సంచలనం వ్యాఖ్యలు చేసింది.

అంతేకాదు ఆమె ఒక చెడ్డ స్త్రీ అని, నా భర్తను దొంగలించింది అని.. ఆమె ఎక్కడైనా కనిపిస్తే అక్కడే కొడతానంటూ రమాలత్ మాట్లాడింది. అలాగే నయనతార చేసిన పని వల్ల మా కుటుంబంలో, దేవా కుటుంబంలో పెద్ద రచ్చ జరిగిందని, నా భర్త ఎంతో మంచి వాడని, కానీ నయనతార వల్లే ఇలా జరిగిందని నయనతారపై పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకొని వెంటనే ఆమెను జైల్లో వేయాలని రమాలత్ డిమాండ్ చేసింది. అప్పట్లో ఈమె వ్యాఖ్యలు కోలీవుడ్లో తీవ్ర దుమారం సృష్టించాయి. అంతేకాదు నయనతార విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న సమయంలో కూడా రమాలత్ నా ఉసురు తగులుతుందని మాట్లాడినట్టు కూడా వార్తలు వినిపించాయి

మరింత సమాచారం తెలుసుకోండి: