స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తాజాగా తాను ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మరి ఇంతకీ శృతిహాసన్ ఎలాంటి వ్యాధితో బాధపడుతుంది..ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. కొంతమంది హీరోయిన్స్ తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని ఇండస్ట్రీలో కొనసాగించడానికి వస్తారు. మరి కొంతమంది తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఉంటారు.కానీ ఈ హీరోయిన్ తండ్రి అంత పెద్ద స్టార్ అయినా కూడా కమల్ హాసన్ పేరుని అస్సలు ఉపయోగించుకోకుండా శృతిహాసన్ సినిమాల్లోకి వచ్చింది. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో శృతిహాసన్ చాలా ట్రోలింగ్ కి గురయ్యింది.కొన్ని ఫేస్ సర్జరీలు చేయించుకున్న తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యింది.అలా మొదట ఈమె చేసిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో శృతిహాసన్ కి తెలుగులో అవకాశాలు తన్నుకొచ్చాయి. ఇక సినిమాల్లో శృతిహాసన్ నీ ఓ సెంటిమెంట్ గా చెప్పుకుంటారు. 

ఎందుకంటే ఎవరైనా వరుస ప్లాపుల్లో ఉన్న హీరోలతో శృతిహాసన్ నటిస్తే కనుక కచ్చితంగా ఆ హీరోకి మళ్ళీ హిట్ పడుతుంది అనే సెంటిమెంట్ కొనసాగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా నుండి ఇది కొనసాగుతోంది.అలా పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చేస్తే అది బ్లాక్ బస్టర్. రవితేజతో బలుపు మూవీ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. అలాగే వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ తో సలార్ లో శృతిహాసన్ నటించింది.సలార్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది.అలాగే వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో ఒకేసారి రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ అడివి శేష్ తో డెకాయిట్ మూవీలో నటించడానికి ఒప్పుకొని కొద్ది మేరా షూటింగ్ కంప్లీట్ అయ్యాక చివరికి ఆ సినిమా నుండి తప్పుకోవడంతో మృణాల్ ని ఇందులో తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రజినీకాంత్ హీరోగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ లు కీలకపాత్రలో చేస్తున్న కూలి మూవీలో కీలక పాత్ర చేస్తోంది.

అలాగే విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న జననాయగన్ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు కూడా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె సినిమాల విషయం పక్కన పెడితే.. శృతిహాసన్ సినిమాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది. అయితే ఆ పోస్టులో ఏం పెట్టిందంటే..శృతిహాసన్ ఓ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుందట. కానీ ఆ వ్యాధి ఏంటి అనేది మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం శృతిహాసన్ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్లు ఇంతకీ శృతిహాసన్ కి ఏమైంది.. ఆమెకు వచ్చిన ఆ వ్యాధి ఏంటి అని కంగారు పడిపోతూ కామెంట్లు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: