
నేచురల్ స్టార్ నాని ఇటీవల కాలంలో తన రూటు మార్చుకున్నాడు. నేచురల్ కథలు .. ప్రేమ కథలను పక్కన పెట్టాడు. తాను మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. కమర్షియల్ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. లాంగ్ ప్లాన్ తో ముందుకు వెళుతున్నాడు. లవర్ బాయ్ గా .. నేచురల్ స్టార్ గా ఉండే నానిలో ఇప్పుడు సరికొత్త మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలోని మాస్ .. యాక్షన్ కమర్షియల్ సినిమాలతో తన రేంజ్ను పెంచుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి దసరా సినిమా నుంచి తన రూటు మార్చాడు .. దానిని నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాడు. తను ప్రయోగాత్మకంగా చేసిన సినిమాలు వర్కౌట్ అయ్యాయి. అందుకే ఇప్పుడు హిట్ 3 తో దానిని కొనసాగిస్తున్నాడు. హిట్ 3 సినిమా పూర్తి యాక్షన్ క్రైమ్ ప్రధానంగా రూపొందిన సినిమా కావడం విశేషం. టీజర్ .. ట్రైలర్ లో చూస్తే రక్తపాతం ఏరులై పారుతుంది.
ఈ సినిమాలో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటించగా శైలేష్ కొలను దర్శకుడు. నానినే నిర్మాత. హిట్ 3 సినిమా ఎందుకు చూడాలంటే ఐదు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాని వైలెన్స్ కి పూర్తి ప్రయారిటీ ఇచ్చాడు. ఇలాంటి నానిని ఇప్పుడు సినిమాలలో చూడలేదు. ఇక రెండో పాయింట్ హిట్ 1,2 సూపర్ హిట్టు అయ్యాయి. ఈ సినిమాలోని కచ్చితంగా కంటెంట్ బాగుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక మూడో కారణం నాని నటన అది తన సినిమాలలో ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. ఇక మనకు అందుతున్న రిపోర్టులు ప్రకారం ఈ సినిమాలో నాని నటన వేరే లెవెల్ లో ఉండబోతుందట. అది సినిమాకి అదే హైలెట్గా నిలుస్తుంది అని అంటున్నారు. ఇక నాలుగో కారణం మిక్కీ జై మేయర్ మ్యూజిక్ ఈ సినిమాకు ఎలాంటి మాస్ బిజిఎం అందించాడు అన్న ఆసక్తి ఉంది. వీటితో పాటు డైరెక్షన్ .. ఇతర టెక్నికల్ అంశాలు ఇందులో భాగం. ఇక సమ్మర్లో ఇప్పటివరకు సరైన సినిమా పడలేదు. తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్ టైం చేసే సినిమాలు రాలేదు ఆ కొరత కూడా ఉంది.. ఈ కారణాలతో హిట్ 3 సినిమాని కచ్చితంగా చూడాలనుకునేవారు ఎక్కువమంది ఉన్నారు.