చాలామంది దర్శకులు యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం తమ సినిమాల్లో హీరో హీరోయిన్లతో రొమాంటిక్,బోల్డ్ సన్నివేశాలను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఓ సినిమాలో ఓ రెయిన్ సాంగ్ ఉందంటే చాలు ఆ సినిమా చూడడానికి ఎంతో మంది జనాలు ఎగబడతారు. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలు రెయిన్ సాంగ్స్ చేసి హిట్టు కొట్టారు.ఇక అలాంటివారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే రోజా, వాణి విశ్వనాథ్, విజయశాంతి, రాధ వంటి హీరోయిన్లతో రెయిన్ సాంగ్ లో నటించారు. అయితే ఇలాంటి రెయిన్ సాంగ్ లు చేస్తే రొమాంటిక్ సన్నివేశాలు చేస్తే హీరో హీరోయిన్లకు మధ్య ఎలాంటి ఫీలింగ్స్ ఉండవా అని చాలామందిలో ఒక అనుమానం అయితే ఉంటుంది.అయితే ఇలాంటి అనుమానమే మెగా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితంగా ఉండే డాక్టర్ గోపీచంద్ కి కూడా వచ్చింది. అయితే తనలో ఉన్న ప్రశ్నలని నేరుగా మెగాస్టార్ చిరంజీవిని అడిగేసారు. 

మీరు ఇప్పటివరకు ఎవరైనా హీరోయిన్లతో ప్రేమలో పడ్డారా..ఇన్ని రొమాంటిక్ సినిమాలు చేశారు..మీ ఫీలింగ్స్ ఏంటి.. హీరోయిన్స్ తో కలిసి రెయిన్ సాంగ్స్ చేస్తే మీ లోపల ఏదైనా ఫీలింగ్ కలుగుతుందా అంటూ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు చిరంజీవి నవ్వుతూ..నేను ఇప్పటివరకు ఏ హీరోయిన్ తో కూడా ప్రేమలో పడలేదు. నేను సినిమాల్లో ఉండే సన్నివేశానికి కేవలం సినిమా వరకు మాత్రమే వృత్తిపరంగా మాత్రమే చూస్తాను. వృత్తిపరంగా మాత్రమే హీరోయిన్లతో కలిసి నటిస్తాను. అంతే  ఒక్కసారి కెమెరా ఆఫ్ అయిందంటే వారితో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయను. ముఖ్యంగా బలహీనతలు ఉంటే ఆ రంగంలో వాళ్ళు ఎదగలేరు. అందుకే సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఇలాంటి బలహీనతలు ఏమీ పెట్టుకోకూడదు. నాకు ఎలాంటి బలహీనతలు కూడా లేవు.

ఒక సినిమాలో రొమాన్స్ చేస్తే అది దర్శకుడు అనుకున్న విధంగా వచ్చిందా లేదా అనేది మాత్రమే చూడాలి.అలాగే ఆ రొమాంటిక్ సన్నివేశంలో రొమాన్స్ పండిందా నటినటులు అందంగా ఉన్నారా అనేది మాత్రమే చూడాలి.అలాగే ఒక సీన్ బాగా పండాలంటే హీరో హీరోయిన్ ఇద్దరు  చాలా క్లోజ్ గా ఉండాలి.వాళ్ళు ఎంత క్లోజ్ గా ఉంటే ఆ సీన్ అంత బాగా పండుతుంది. అయితే ఇలాంటి సీన్స్ చేసిన సమయంలో కొన్ని రూమర్లు వినిపిస్తాయి. కానీ ఎంత క్లోజ్ గా నటించినా కూడా అది కేవలం సినిమా కోసం మాత్రమే కానీ వేరే రిలేషన్ కోసం కాదు అని గ్రహించాలి. అలాగే నేను మొదటి నుండి ఆంజనేయ స్వామి భక్తుడిని కాబట్టి ఏ సీన్ చేయాలనుకున్నా కూడా మొదట నేను ఆ ఆంజనేయుడిని నా మదిలో తలుచుకుంటాను. ఆ తర్వాతే నేను ఆ సీన్ చేస్తాను. అందుకే నాకు ఇప్పటివరకు కూడా ఎలాంటి దురుద్దేశాలు నా మైండ్లో రాలేదు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: