టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో నాగ వంశీ ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో నిర్మించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఇకపోతే నిర్మాతగా చాలా కాలం నుండి కెరీర్ను కొనసాగిస్తున్న నాగ వంశీ ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను నాగ వంశీ కొనుగోలు చేసి ఈ మూవీ ని పెద్ద స్థాయిలో విడుదల చేశాడు. దానితో నాగ వంశీ కి తారక్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ ద్వారా పెద్ద ఎత్తున లాభాలు కూడా వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "వార్ 2" అనే హిందీ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులను నాగ వంశీ దక్కించుకున్నాడు అని ఒక వార్త తాజాగా పెద్ద ఎత్తున వైరల్ అయింది.

ఇకపోతే తాజాగా ఈ వార్త పై నాగ వంశీ స్పందిస్తూ ... వార్ 2 సంబంధించిన థియేటర్ హక్కులను నేను దక్కించుకున్నాను అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని , వార్ 2 సినిమా హక్కులను నేను ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: