ప్రతి సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమైన నెలలలో ఏప్రిల్ ఒకటని చెప్పవచ్చు. ఏప్రిల్ నెలలో ఏకంగా 24 సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలలో ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవలేదు. గతేడాది ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఈ ఏడాది కూడా విడుదలైన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
 
ఏప్రిల్ నెల మొదటి వారంలో 28 డిగ్రీస్, వృషభ, శారీ సినిమాలు విడుదల కాగా ఈ మూడు సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఆదిత్య 369 సినిమా రీరిలీజ్ కాగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది. ఏప్రిల్ సెకండ్ వీక్ లో జాక్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలు నిలవగా ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
 
ఏప్రిల్ మూడో వారంలో ఓదెల2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలకు మంచి టాక్ వచ్చినా ప్రేక్షకులను మెప్పించలేదు. ఏప్రిల్ నెల చివరి వారంలో సారంగపాణి జాతకం రిలీజ్ కాగా ఈ సినిమా కూడా హిట్ కాలేదు. ఏప్రిల్ నెల నిర్మాతలకు ఒకింత భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిందని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.
 
హిట్3 సినిమా సక్సెస్ సాధించడం మే నెలకు మాత్రం కొత్త ఊపును ఇచ్చింది. రాబోయే రోజుల్లో విడుదలయ్యే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. నాని ది ప్యారడైజ్ సినిమాతో సైతం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. నాని ఈ సినిమాతో ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. నాని రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి మే నెల కలిసిరావాలని సినీ అభిమానులు ఫీల్ అవుతుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: