
28 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తుండగా అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే నమ్మాల్సి ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో క్రేజీ సినిమాల హక్కులను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. హిట్3 సినిమా సంచలన రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. హిట్3 మూవీ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సి ఉంది.
హిట్3 సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాతో ఫామ్ లోకి వచ్చేసినట్టే అని చెప్పవచ్చు. హిట్3 సినిమా ఫైనల్ రేంజ్ చూడాల్సి ఉంది. న్యాచురల్ స్టార్ నాని ప్రేక్షకులను మెప్పించే సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుంటున్నారు. నాని పారితోషికం 30 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
న్యాచురల్ స్టార్ నాని భవిష్యత్తు సినిమాలతో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. హిట్3 సినిమా సక్సెస్ తో శైలేష్ కొలను రెమ్యునరేషన్ సైతం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. న్యాచురల్ స్టార్ నాని లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. స్ట్రాంగ్ విలన్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.