
ఆ కామెంట్ల గురించి సంతోష్ నారాయణన్ రియాక్ట్ అవుతూ అది కేవలం వారి ఊహ మాత్రమేనని చెప్పుకొచ్చారు. తమ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉందని కార్తీక్ సుబ్బరాజు పేర్కొన్నారు. తమ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. తమ చిత్రానికి సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ బలమైందని ఆయన తెలిపారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో కార్తీక్ సుబ్బరాజుకు మంచి పేరు ఉంది. పిజ్జా, జిగర్తాండ, పేట సినిమాలు ఈ దర్శకునికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే రుక్మిణి పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో భాగం కావడాన్ని తాను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని ఆమె పేర్కొన్నారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో మూగముడి సినిమాతో పూజా హెగ్డే కెరీర్ మొదలైంది. 13 సంవత్సరాల నుంచి ఎక్కువ సంఖ్యలో సినిమాలలో యాక్ట్ చేసి ఎన్నో విజయాలను అందుకున్నారు. రెట్రో సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. కమర్షియల్ గా ఈ సినిమా రేంజ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. సూర్యకు సైతం వరుసగా భారీ షాకులు తగులుతున్నాయి. పూజా హెగ్డే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. పూజా హెగ్డే నెక్స్ట్ లెవెల్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.