ఏదైనా సినిమాను మొదలు పెట్టాము అంటే ఆ సినిమా విడుదల తేదీ పై మేకర్స్ కు పక్కా క్లారిటీ ఉండాలి. ఒక వేళ సినిమా పనులు ఏ విధంగా జరుగుతాయి సినిమా ఏ టైమ్ వరకు పూర్తి అవుతుంది అనేది మేకర్స్ కి పెద్దగా క్లారిటీ లేనట్లయితే ఆ మూవీ విడుదల తేదీని మొదట అనౌన్స్ చేయకపోవడం చాలా బెటర్. కానీ సినిమా విడుదల తేదీని మొదట అనౌన్స్ చేసి ఆ తర్వాత ఆ మూవీ చాలా రోజులు వాయిదా పడినట్లయితే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.

ఇకపోతే విశ్వంభర సినిమా విడుదల విషయంలో కూడా ఇలాంటి సమస్య మేకర్స్ కి ఎదురవుతుంది. ఈ మూవీ ని చాలా కాలం క్రితం మొదలు పెట్టారు. ఈ సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు  ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయడం లేదు అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఆ తర్వాత ఈ తేదీన కూడా ఈ సినిమా విడుదల కావడం లేదు అని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత ఈ మూవీ ని ఈ సంవత్సరం జూలై నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని మరో వార్త వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఈ సంవత్సరం జూలై నెలలో కాకుండా ఏకంగా సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ మూవీ విడుదల తేదీ పై అనేక వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో ఈ సినిమాపై ఏమైనా అంచనాలు తగ్గుతాయా అని మెగా ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: