
ఇవే కాకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ప్రభాస్ స్పిరిట్ అనే సినిమాని చేయబోతున్నట్లు టైటిల్ ని కూడా ప్రకటించారు. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించిన సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా సీక్వెల్ తీయడానికి సిద్ధమవుతున్నట్లు వినిపించాయి. అయితే ఈ మూవీ తర్వాతే ప్రభాస్ స్పిరిట్ వస్తుందని గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో నిర్మాత భూషణ్ ప్రభాస్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందని తెలియజేశారట.
మరో రెండు మూడు నెలలలో కచ్చితంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని 2027 లో ఈ సినిమాని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు నిర్మాత భూషణ్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారని ఒక పవర్ ఫుల్ పాత్రలో అభిమానులను మెప్పించబోతున్నట్లు టాకు వినిపిస్తోంది. రాజా సాబ్ సినిమా అయిపోయిన వెంటనే స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట. అలాగే సలార్ 2 సినిమా షూటింగ్లో కూడా కంటిన్యూ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటలీలో ఇటీవలే ఉన్న ప్రభాస్ ఇండియాకి తిరిగి వచ్చారట. దీంతో రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారట.