ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతో దూసుకుపోతున్నాయి. అయితే కొన్ని సినిమాలు కంటెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు కూడా అంచనాలు తగ్గట్టుగా కలెక్షన్స్లను కూడా రాబట్ట లేకపోతున్నాయి. హీరో కమలహాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు 2 సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించినప్పటికీ ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలవ్వగా కలెక్షన్స్ మాత్రం సంపాదించలేకపోయింది.


ఇక అలాగే కోలీవుడ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా కూడా భారీ హైప్ తో రిలీజ్ చేశారు.. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా 250 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిందట. అయితే ఇప్పుడు ఇలాంటి సినిమాలు అన్నిటిని మించి బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిన చిత్రం బాంబే వెల్వెట్ ..


డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రణబీర్ కపూర్, అనుష్క శర్మ నటించారు. అలాగే మనీష్ చౌదరి, సిద్ధార్థ బసు, తదితర నటీనటులు సహాయక పాత్రలో నటించారట. 15- 5-2015 లో ఈ సినిమా విడుదల అయింది ముంబై టేబుల్స్ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక సాధారణ వ్యక్తి ఎలా గొప్ప వ్యక్తిగా ఎదుగుతారు అనే కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమా విమర్శకులు నుండి మిశ్రమ స్పందన లభించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టాలను చవిచూసింది. సుమారుగా 115 కోట్ల రూపాయలతో తీస్తే 43 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్స్ రాబట్టిందట. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచిన ఈ సినిమా పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయట కథను కూడా అనేక పార్టీలుగా తీయాలని చూసిన బాంబే వెల్వెట్ ఫ్లాప్ అవడంతో నిలిపివేశారు అనురాగ్ కశ్యప్.

మరింత సమాచారం తెలుసుకోండి: