పుష్ప టు విడుదల సమయంలో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి ఆ తర్వాత ప్రెస్ మీట్ రచ్చ రచ్చ జరిగాక మొదటిసారి అల్లు అర్జున్ వేవ్స్ అనే కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.ఇందులో భాగంగా ఎన్నో రోజుల నుండి మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ దూరం పెడుతున్నారు అనే రూమర్స్ కు కూడా తెర దించారు.మా మామయ్య చిరంజీవి నాకు స్ఫూర్తి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటీ చెప్పారు. అలాగే నా అభిమానుల కారణంగానే నేను ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాను అని కూడా అభిమానులను పొగుడుతూ కామెంట్స్ చేశారు. అయితే ఇదే వేవ్స్ కార్యక్రమంలో మీడియా ఛానల్ వాళ్ళు అల్లు అర్జున్ తో ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అయితే ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అదేంటంటే.. ఆ హీరోయిన్ రెచ్చగొట్టడం వల్లే నేను ఇలా తయారయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అల్లు అర్జున్ ని ఎందుకు రెచ్చగొట్టింది అనేది ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్ లో నాతో కలిసి నటించిన ఓ హీరోయిన్ సౌత్ ఇండస్ట్రీని ఎగతాళి చేస్తూ మాట్లాడింది. అసలు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోలకు కూడా సిక్స్ ప్యాక్ లేవు అని,సిక్స్ ప్యాక్ ట్రై చేయడం కూడా వారికి రాదని,వారు సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేయలేరు అంటూ చాలా దారుణంగా అవమానించింది.

అయితే ఆ హీరోయిన్ ని ఆరోజు నేను ఏమీ అనలేదు. కానీ ఆమె మాటలను చాలెంజింగ్ గా తీసుకొని ఏదైతే సౌత్ హీరోల వల్ల కాదు అని అవమానించి మాట్లాడిందో అదే హీరోయిన్ తో సిక్స్ ప్యాక్ బాగున్నాయి అని చెప్పించుకోవాలి అనే ఉద్దేశంతో సిక్స్ ప్యాక్ ట్రై చేశాను.అలా హీరోయిన్ రెచ్చగొట్టడం వల్లే నేను సిక్స్ ప్యాక్ బాడీ తెచ్చుకున్నాను. ఏదైనా మనతో కాదు అని అన్న పనిని చేసి చూపిస్తే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. ఆ హీరోయిన్ అవమానించిన మాటలకు నేను చేసి చూపించాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. కానీ అల్లు అర్జున్ ని,సౌత్ ఇండస్ట్రీ హీరోలను అవమానించిన హీరోయిన్ ఎవరు అనేది మాత్రం పేరు బయట పెట్టలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: