
మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమా తర్వాత బన్నీ సినిమాకే పరిమితమై ఉన్నారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో ప్రూవ్ చేసుకోలేదు.
త్రివిక్రమ్ సినిమాలకు పంచ్ డైలాగ్స్ హైలెట్ గా నిలవగా ఆయన డైరెక్షన్ లో తెరకెక్కి ఇతర భాషల్లోకి డబ్ అయిన సినిమాలు మరీ భారీ స్థాయిలో సంచలనాలు సృష్టించిన సందర్భాలు అయితే లేవనే చెప్పాలి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరనే సంగతి తెలిసిందే.
వెంకటేశ్, శివ కార్తికేయన్ లతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతుండగా త్రివిక్రమ్ మీడియా ముందుకు వస్తే మాత్రమే పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భవిష్యత్తు సైతం బన్నీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ ను మొదట స్టార్ట్ చేయనున్న నేపథ్యంలో ఈ సందేహాలు తలెత్తుతున్నాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వేగంగా సినిమాలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరో బన్నీతో త్రివిక్రమ్ మైథలాజికల్ టచ్ తో సినిమాను తెరకెక్కించాల్సి ఉందని తెలుస్తోంది.