తనని తన్నేవాడు ఒకడుంటే తన తలను తన్నేవాడు మరొకరు ఉంటాడు . ఈ డైలాగ్ ని కామన్ గా మనం ఇంట్లో పెద్ద వాళ్ళ దగ్గర వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇదే డైలాగ్ ని నానికి సెట్ అయ్యేలా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నానిని తెగ పొగిడేస్తున్నారు.  దానికి రీజన్ హిట్ 3 సినిమా. హిట్ 3 సినిమాలో నాని పర్ఫామెన్స్ బాగుంది.  నిజమే.  హిట్ 3 సినిమా మంచిగా జనాలను ఎంటర్టైన్ చేస్తుంది.  నిజమే. హిట్ 3 సినిమా హ్యూజ్ కలెక్షన్స్ సాధిస్తుంది . నిజమే . అయితే హిట్ త్రీ సినిమా జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ..? అనే విధంగా కూడా మాట్లాడుకునే జనాలు ఉన్నారు. హిట్ 3 సినిమా బాగుంది నాని పర్ఫామెన్స్ బాగుంది అని మాట్లాడుకుంటున్న జనాలు అసలు ఆయన మాట్లాడిన బూతు పదాలు ఎన్ని ఉన్నాయి ఆ క్రుయాలిటీ ఏంటి అనే విషయాల గురించి హైలెట్ చేస్తున్నారు .


మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క స్టార్స్ కి ఇది ఒక అలవాటుగా మారిపోయింది అని .. సినిమాలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉన్న ఎక్స్ట్రీమ్ బూతు సీన్స్ ..బూతు పదాలు మాట్లాడిన ఖచ్చితంగా ఆ సినిమాని యువత హిట్ చేసేస్తుంది అని .. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాను తెరకెక్కించాలి అంటే కొన్ని నీతి నియమాలు ఉంటాయి అని .. ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ అందరూ అది వదిలేసినట్లు ఉన్నారు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . నాని నటించిన హిట్ త్రీ సినిమాకి ఎంత పాజిటివ్ కామెంట్స్ దక్కుతున్నాయో అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా దక్కుతున్నాయి . దీంతో నాని పై ఓ వర్గం ప్రేక్షకులు కూసింత నెగిటివ్గా స్పందిస్తున్నారు. మరి ముఖ్యంగా కొన్ని కొన్ని అసభ్యకర పదాలు నాని నోటి నుండి వినడం నాని ఫాన్స్ కి కూడా నచ్చలేదు అంటూ మాట్లాడుతున్నారు.



అయితే గతంలో తారక్ ని కూడా ఇదే విధంగా ఓ డైరెక్టర్ సినిమాలో బూతు పదాలు వాడాలి అంటూ బలవంతం చేశారట.  పూరీ జగన్నాథ్ దర్శకత్వం "టెంపర్" సినిమాలో నటించాడు తారక్.  తారక్ఈ సినిమాలో కూసింత హద్దులు మీరుతూ బోల్డ్ బూతు పదాలు వాడాలి అంటూ పూరి జగన్నాథ్.. తారక్ ని అడిగారట . కానీ తారక్ మాత్రం అస్సలు అలాంటి పదాలు నా నోటి నుండే రావు అంటూ తెగేసి చెప్పేసారట..!

మరింత సమాచారం తెలుసుకోండి: