
అయితే అల్లరి మొగుడు సినిమా సక్సెస్ తర్వాత రమ్యకృష్ణ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదని చెప్పవచ్చు. అయితే అప్పట్లో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ రమ్యకృష్ణ కెరీర్ పరంగ ఒకింత ఇబ్బందులను ఎదుర్కొన్నారనే సంగతి తెలిసిందే. అయితే బాహుబలి తర్వాత కూడా రమ్యకృష్ణ కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం.
బాహుబలి, బాహుబలి2 సక్సెస్ సాధించినా ఆ విజయాలు రమ్యకృష్ణ కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేదు. ఈ సినిమాల తర్వాత రమ్యకృష్ణ నటించిన మెజారిటీ సినిమలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరుత్సాహానికి గురి చేశాయనే సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ పారితోషికం మాత్రం రోజుకు 10 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న నటీమణులు తక్కువగానే ఉన్నారు.
రాబోయే రోజుల్లో అయినా రమ్యకృష్ణకు భారీ విజయాలు దక్కాలని ఆమె అభిమానులు ఫీలవుతున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో ఛాన్స్ దక్కితే కెరీర్ పరంగా రమ్యకృష్ణకు తిరుగుండదని చెప్పవచ్చు. రమ్యకృష్ణకు పాన్ ఇండియా డైరెక్టర్లు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. రమ్యకృష్ణకు 2025 కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఐదు పదుల వయస్సులో కూడా ఆమె లుక్స్ తో అదరగొడుతున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.