ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని సినిమాలు చూడడానికి జనాలే రావట్లేదని చాలామంది నిర్మాతలు కూడా బాధపడుతూ ఉంటే హీరో నాని మాత్రం తన సినిమాలతో థియేటర్లలో హౌస్ ఫుల్ చేస్తున్నారనే విధంగా వినిపిస్తోంది. ఒకపక్క హీరోగా మరొక పక్క నిర్మాతగా కూడా దూసుకుపోతున్నారు నాని. ఇటివలె నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా  మే ఒకటవ తేదీన రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా మొదటి రోజే 40 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.


నాని కెరియర్ లోనే అత్యధికంగా ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా హిట్ 3 సినిమా నిలిచింది. ఇక మూడు రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే 82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యపరస్తోంది ఈ చిత్రం. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ రోజున ఆదివారం కాబట్టి రేపటి రోజు కల్లా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఈజీగా రాబడుతుందని అభిమానులు ధీమా తెలియజేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబడితే సరిపోతుంది.


ఈరోజుతో కచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించి రేపటి రోజు నుంచి లాభాలతో హిట్ 3 సినిమా దూసుకుపోతుంది. ఇక అమెరికాలో కూడా ఈ సినిమా ఆల్మోస్ట్2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటించగా డైరెక్టర్ శైలేష్ కోలను ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన హిట్ 3 సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నది.. హీరో నాని కెరియర్ లోనే ఒక విభిన్నమైన పాత్రలో కనిపించారట. మరి ఫైనల్ గా ఎన్ని కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: