సాధారణంగా ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మనం మన బంధువులతో చుట్టుపక్కల వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం . అది చిన్నదైనా పెద్దదైన . కానీ ఇప్పుడు మాత్రం ఆ ట్రెండ్ మారిపోతుంది . ఏదైనా శుభవార్తను  పక్కింట్లో వారికి చెప్పాలి అన్న.. తెలిసిన వాళ్ళకి చెప్పాలి అన్న టెన్షన్ పడిపోతున్నారు జనాలు.  మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎప్పటికప్పుడు దాచేస్తూ వస్తున్నారు.  ఈ మధ్యకాలంలో కామన్ పీపుల్స్ ఏ కాదు స్టార్ సెలబ్రెటీస్ కూడా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచేస్తూ పూర్తిగా తొమ్మిది నెలలౌ నిండిన తర్వాతే బయటపెడుతున్నారు .


వాళ్ల ప్రైవసీకి భంగం కలుగుతుంది అన్న భయమో.. లేకపోతే దిష్టి తగులుతుంది అన్న టెన్షనో రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచేస్తున్నారు . ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల అదే విధంగా మెగా  కోడలు పిల్ల లావణ్య త్రిపాఠి అదేవిధంగా స్టార్ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ముగ్గురు హీరోయిన్స్ ఒకే టైంలో ప్రెగ్నెంట్ అవ్వడం పై ఫ్యాన్స్ కూడా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు .



అయితే ఈ విషయాన్ని వాళ్ళు అఫీషియల్ గా చెప్పకపోవడం కొంచెం టెన్షన్ పెడుతుంది . ఎందుకు ఈ హీరోయిన్స్ ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచుతున్నారు ..?అనేది బిగ్ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. కొంతమంది వాళ్ళ ప్రైవసీ మేటర్ అది అని అంటుంటే మరి కొంతమంది అసలు వాళ్ళు ప్రెగ్నెంట్ అయి ఉండరు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు.  కావాలని గుడ్ న్యూస్ అని తెలిసి దాచేస్తున్నారా..? లేకపోతే సెలబ్రిటీ హోదా లైఫ్ ను ఇలానే ముందుకు తీసుకెళ్లాలి అంటూ తమ ప్రెగ్నెన్సీ విషయాలను దాచేస్తున్నారా..? రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ హీరోయిన్స్ తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచేసి సోషల్ మీడియాలో కూసింత నెగిటివ్ టాక్ మూటకట్టుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: