టాలీవుడ్ హీరోయిన్ రెబా మోనికా జాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. అలాగే మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో కూడా స్వాతి రెడ్డి అనే పాటలో దుమ్ము రేపే స్టెప్పులు వేసి మరొకసారి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది మోనికా. బెంగళూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ 2016 లో స్వర్గరాజ్యం అనే మలయాళ సినిమాతో మొదటిసారిగా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో ఫోరెన్సిక్ , బిగిల్,FIR తదితర చిత్రాలలో కూడా నటించింది.


ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు స్పెషల్ పాత్రలో కూడా ఆకట్టుకుంటుంది రెబా మోనికా జాన్. సినిమాల సంగతి పక్కన పెడితే నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచు గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను షేర్ చేయగ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అందరూ తన భర్త జోయన్ జోసెఫ్ తో కలిసి కొన్ని రొమాంటిక్ ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది రెబా మోనికా జాన్.


తన భర్త పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఈ ఫోటోలను పంచుకున్నట్లు తెలియజేసింది. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానులు సైతం ఈ ముద్దుగుమ్మకు పెళ్లి అయిపోయిందా అంటు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ 2002లో వివాహం చేసుకోవడం జరిగింది. వీరిది ప్రేమ వివాహం ఇక ఈమె భర్త జోసెఫ్ విషయానికి వస్తే ఒక ప్రముఖ కంపెనీలు కన్సల్టేషన్ గా పని చేస్తున్నారట. అలాగే కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నట్లు సమాచారం.రెబా మోనికా జాన్ సినిమాల విషయానికి వస్తే తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది విజయ్ దళపతి నటిస్తున్న జననాయగన్ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: