పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం టాలీవుడ్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని స్టార్ట్ చేసిన తర్వాత కొంత కాలం పాటు ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరిగింది. దానితో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత కాలానికి ఈ మూవీ నుండి ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేశారు. దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ వీడియో విడుదల తర్వాత ఒక్క సారిగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయికి చేరిపోయాయి.

దానితో పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ... ఇప్పుడు చూద్దామా అనే ఆసక్తిని చూపించారు. కానీ ఆ తర్వాత పవన్ రాజకీయ పనులతో ఫుల్ బిజీ కావడం వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా స్లో గా జరుగుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఇమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఓజి మూవీ కి సంబంధించిన కొన్ని కీలక విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ... ఓజి సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు నా కాంబోలో వచ్చే సన్నివేశాలను ఇప్పటి వరకు చిత్రీకరించలేదు. బహుశా మరో రెండు , మూడు నెలల్లో పవన్ మరియు నా మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఆయన కాంబోలో ఎప్పుడు షూటింగ్ చేస్తానా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ఇమ్రాన్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: