మెగాస్టార్ చిరంజీవి ఆఖరుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా ద్వారా చిరంజీవి కి అపజయం దక్కింది. భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాను మొదట ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ బృందం ఆ సినిమాని ఆ తేదీన విడుదల చేయడం లేదు అని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కొత్త విడుదల తేదీని ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే చిరంజీవి తన తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం అనిల్ ... చిరంజీవి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా అనిల్ , చిరుకు జోడిగా ఓ ముద్దుగుమ్మను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... చిరు , అనిల్ కాంబో సినిమాలో నయనతార హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. గతంలో చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహారెడ్డి మూవీలో నయనతార హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. దానితో సైరా నరసింహారెడ్డి హిట్ ఫార్ములాను అని మరోసారి అనిల్ ఫాలో అవుతున్నాడు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: