బాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వారిలో ఐశ్వర్య రాయ్ కూడా ఒకరు.. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించినప్పటికీ కూడా ఆమె పేరు ఏదో ఒక విషయంలో వినిపిస్తూ ఉంటుంది. ఇటీవలే అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తు తనకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించుకుంటూ ఉన్నది. తాజాగా ఐశ్వర్య రాయ్ సినిమాలలో ముద్దులు పెట్టుకోవడం తనకు అసౌకర్యంగా అనిపించినందు వల్లే తాను ఎన్నో సినిమాలను వదిలేసుకోవలసి వచ్చిందని వెల్లడించింది.


తాను ఇంతకుముందు ఎప్పుడూ కూడా తెరపైన అలాంటి సన్నివేశాలు చేయలేదని అందుకే తనకు ఆ సన్నివేశాలు సరిగ్గా అనిపించలేదని తెలియజేసింది. ముఖ్యంగా ధూమ్ 2లో తన అనుభవాన్ని సైతం తెలియజేస్తూ.. ఈ చిత్రంలో నటించిన ముద్దు సన్నివేశం చాలా వివాదాలకు దారి తీసింది.. యూత్ ఎక్కువగా రోల్ మోడల్ గా తన చూసినప్పటికీ అలాంటి సన్నివేశాలను చేయడం వల్ల కాస్త అసౌకర్యంగా తెలియజేస్తే చాలా మంది కొన్ని లీగల్ నోటీసులు కూడా పంపించారట. అంతేకాకుండా  ఐకానిక్ హోదా ఆదర్శప్రాయమైన వ్యక్తిగత జీవితాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని పాత్రలు ఎంచుకోవాలంటు అభిమానులు ప్రశ్నించారట.


అభిమానుల నుంచి అలాంటి నోటీసు రావడంతో తాను ఆశ్చర్యపోయానని ఒక నటిగా తన పని కేవలం చేస్తూ పోవడమే పని అనుకున్నాను.. కానీ కొన్ని సెకండ్ల సన్నివేశం గురించి వివరించమని అడగడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపింది. చాలామంది వెండితెర పైన ముద్దు సన్నివేశాలలో నటించినప్పటికీ కానీ ఇండియన్ సంస్కృతిలో ఇది బహిరంగంగా ప్రదర్శించడం వంటివి అసాధారణమని అందుకే అభిమానులు అలాంటి వాటిని పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారని తెలియజేసింది.ఇండియన్ సినిమాలలో చాలామంది నటీనటులు ముద్దు సన్నివేశాలు పెట్టుకోవడం అరుదుగా జరుగుతూ ఉంటుందని తెలిపింది. మొత్తానికి ఇలాంటి కిస్ సన్నివేశాల వద్ద తాను అసౌకర్యంగా ఫీల్ అయ్యి చాలా సినిమాలను వదిలేసానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: