"ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు మిన్న" అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది . ప్రజెంట్ ఇప్పుడు అలాంటి సామెతను అక్కినేని ఫ్యామిలీకి అప్లికేబుల్ చేస్తున్నారు కొందరు మీమర్‌స్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అయ్యాయో ఎలా వైరల్ అయ్యాయో మనం చూశాం.  మరి ముఖ్యంగా "తండేల్" సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం .. 100 కోట్లు కలెక్ట్ చేయడం ..అక్కినేని ఫ్యామిలీ నుంచి ఫస్ట్ హీరో 100 కోట్ల క్లబ్ లోకి చేరడం దీనంతటికీ కారణం మా కోడలు శోభిత ధూళిపాల అంటూ అక్కినేని నాగార్జున ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇవ్వడం అందరికి కోపం తెప్పించింది.


కష్టపడింది చేసింది నాగచైతన్య..అండ్ సినిమా టీం . ఇందులో శోభిత ధూళిపాళ్ళ చేసిన పని ఏంటి ..? అంటూ చాలామంది వెటకారంగా కౌంటర్స్ వేశారు . శోభిత  అసలు నాగచైతన్యకి సరి జోడి కానేకాదు అని నువ్వే బలవంతంగా వాళ్ళిద్దరిని కలిపినట్టున్నావ్ అంటూ రకరకాలుగా మాట్లాడారు . అయితే అవేవీ పెద్దగా పట్టించుకోని నాగార్జున తన కోడలికి ఇంటి బాధ్యతలను పూర్తిగా ఇచ్చేసాడు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇకపై అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి బిజినెస్ వ్యవహారాలను మొత్తంగా శోభిత ధూళిపాళ్ళనే చూసుకోబోతుందట.  అలానే అమల చేతి నుంచి అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను శోభిత  చేతికి ఇచ్చేసారట నాగార్జున.



ఇకపై అన్నపూర్ణ స్టూడియోస్ విషయాలు ..ఫ్యామిలీ బిజినెస్ విషయాలు మొత్తంగా శోభిత ధూళిపాళ్లనే ఫైనలైజ్ చేయాలట.  దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సడన్గా నాగార్జున ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ . అయితే నాగార్జున - అమల ఏజ్ అయిపోతుంది అని ..నెక్స్ట్  ఆ రెస్పాన్సిబిలిటీస్  మొత్తం అఖిల్ - నాగచైతన్య మీదే పడుతుంది అని.. ఆ కారణంగానే టోటల్ బాధ్యతలను వాళ్ళిద్దరికీ అప్పచెప్పేయాలి అని ఆలోచించి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారట నాగార్జున.  అంతేకాదు చిన్న కోడలు జైనబ్ రవ్జీకి ఫామిలీ బరువు బాధ్యతలను షేర్ చేసేసినట్లు కూడా ఓ న్యూస్ బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: