తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలు ఐటమ్ సాంగ్స్ చేయడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. అందుకు ప్రధాన కారణం స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న సమయంలో ఐటమ్ సాంగ్స్ చేసినట్లయితే ఆ తర్వాత కూడా వారికి అలాంటి అవకాశాలే వస్తాయి అని , హీరోయిన్ అవకాశాలు తగ్గుతాయి అనే కారణంతో వారు ఐటమ్ సాంగ్స్ కి దూరంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలు వరుసగా ఐటమ్ సాంగ్స్ లలో నటిస్తూ వస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ కలిగిన ముద్దుగుమ్మలు అయినటువంటి అనుష్క , కాజల్ అగర్వాల్ , సమంత కూడా స్పెషల్ సాంగ్స్ చేశారు. కానీ వీరు ముగ్గురు కూడా ఇప్పటివరకు తమ కెరియర్లో ఒకే ఒక్క మూవీలో స్పెషల్ సాంగ్ చేశారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. ఇకపోతే టాలీవుడ్ యువ నటి శ్రీ లీల కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 2 మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. దీని ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ బ్యూటీ కూడా అనుష్క , కాజల్ , సమంత ఫార్ములాను ఫాలో అవుతుంది అని , కెరియర్లో ఒకే ఒక స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ సాంగ్స్ చేయడం ఆపివేస్తుంది అని చాలా వార్తలు వచ్చాయి.

కానీ ఈ బ్యూటీ అనుష్క , కాజల్ , సమంత ఫార్ములాను బ్రేక్ చేసి మరో మూవీ లో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో శ్రీ లీల స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: