టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వెంకి అట్లూరి ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఒకటి , రెండు సినిమాలను మినహాయిస్తే అన్ని సినిమాలతో కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. దానితో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆఖరుగా వెంకీ అట్లూరి మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ అనే సినిమాను రూపొందించాడు.

మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇకపోతే వెంకీ అట్లూరి తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి సూర్యతో చేయబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన విషయాన్ని కూడా సూర్య చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే సూర్య , వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కబోయే సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సూర్య , వెంకీ అట్లూరి కాంబోలో రూపొందబోయే సినిమాను నాగ వంశీ ఏకంగా 120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వెంకీ అట్లూరి తక్కువ బడ్జెట్ సినిమాలను , మీడియం బడ్జెట్ సినిమాలను రూపొందించాడు. కానీ సూర్య మూవీతో భారీ బడ్జెట్ మూవీ ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సూర్య తాజాగా రెట్రో అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: