
కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తోనే ఏకంగా రూ.500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు.. ఇటీవల జపాన్‌లోనూ ఈ సినిమా రిలీజ్ అయి మంచి రిజల్ట్ అందుకుంది. కాగా ఈ సినిమా సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 2 పై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక దేవర 2 మంచి సక్సెస్ అందుకున్నా.. సినిమాలో తారక్ నట వీశ్వరూపాన్ని పూర్తిస్థాయిలో చూపించలేదని.. ఎక్కడో ఏదో మిస్సయింది అంటూ విమర్శలు వినిపించాయి. ఎన్టీఆర్ పాత్రలో కాస్త మాస్ యాంగిల్ పెట్టి.. మసాలా యాడ్ చేసి ఉంటే ఆర్ఆర్ఆర్ కంటే బ్రహ్మాండమైన సక్సెస్ అందుకునేది అంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ క్రమంలోనే కొరటాల శివకు అభిమానులు డిమాండ్ మొదలుపెట్టారు. దేవర పార్ట్ 2లో కచ్చితంగా ఎన్టీఆర్ రోల్ మరింత మాస్గా ఉండేలా ప్లాన్ చేయాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొదటి పార్ట్‌లో ఎన్టీఆర్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో కొరటాల ఫెయిల్ అయ్యాడని.. పార్ట్ 2 విషయంలో మాత్రం ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆయన పాత్రను మరింత పవర్ఫుల్ గా చూపించమంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 2 విషయంలో కొరటాల భారీ మార్పులు చేశాడని.. క్యారెక్టరైజేషన్ మరింత పవర్ఫుల్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.