
ఈ సినిమాకు బడ్జెట్ 110 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. హారిక హాసిని బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉంది. బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టం కాదు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే కనీసం 40 కోట్ల రూపాయల లాభాలు పక్కా అని సమాచారం అందుతోంది. వెంకటేశ్ సైతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి ఒకింత ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
యంగ్ డైరెక్టర్లతో పోలిస్తే సీనియర్ డైరెక్టర్లు తనకు బెస్ట్ ఆప్షన్ అవుతారని వెంకటేశ్ భావిస్తున్నారని తెలుస్తోంది. విక్టరీ వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. వెంకటేశ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్నారనే సంగతి తెలిసిందే.
విక్టరీ వెంకటేశ్ కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస విజయాలతో వెంకటేశ్ పారితోషికం 25 కోట్ల రూపాయలకు చేరింది. వెంకటేశ్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటేశ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. వెంకటేశ్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు.