
అయితే కాఫీర్ చిత్రంలో పాకిస్తాన్ అమ్మాయి పాత్రలో దియా మీర్జాన్ అద్భుతంగా నటించింది. అయితే ఇందులో ఒక సన్నివేశం చేస్తున్నప్పుడు తన బాడీ షేక్ అయిందని తెలియజేసింది. ఇందుకోసం తాను చాలానే కష్టపడ్డానని కూడా వెల్లడించింది. కాఫీర్ చిత్రంలో ఒక రేప్ సీన్ ఉన్నది.. అందులో తాను నటించానని ఆ సీన్లో నటించినప్పుడు తనలో వణుకు పుట్టించింది అంటూ తెలియజేసింది. ఈ సన్నివేశం చేసిన తర్వాత బాడీ షవర్ అయిందని, వాంతులు కూడా చేసుకున్నాను అంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది దియామీర్జా.
ఆ రేప్ సీన్ తన లైఫ్లో అసలు మర్చిపోలేని ఒక సంఘటన అంటూ తెలియజేసింది దియా మీర్జా. అంతే కాకుండా ఇందులో తల్లి పాత్రలో కనిపించిన ఈమె ఇక అమ్మగా తాను మరింత నేర్చుకున్నట్లు తెలియజేసింది. ఈ సినిమా అనుభవం తాను ఎప్పటికీ కూడా మర్చిపోలేని పాత్ర అని తెలియజేసింది. త్వరలోనే మరిన్ని సినిమా అప్డేట్లతో మీ ముందుకు వస్తానంటూ తెలియజేసింది దియా మీర్జా. అందుకే ఇక మీదట పాత్రలను ఎంచుకునే సమయంలోనే ఆచితూచి అడుగులు వేస్తున్నాను అంటూ తెలియజేసింది. మరి రాబోయే రోజులు ఎలాంటి పాత్రలతో మరింత అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి దియా మీర్జా.