చాలా రోజుల నుండి త్రిష కోలీవుడ్ నటుడు విజయ్ తలపతిని పెళ్లాడబోతుంది అనే రూమర్లు వినిపిస్తున్నాయి. విజయ్ తలపతి త్రిష ఒకప్పుడు సినిమాలు చేసిన సమయంలో ప్రేమలో పడి డేటింగ్ కూడా చేశారు. కానీ వీరిద్దరు పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత చాలా రోజులు దూరంగా ఉన్న వీరు లియో సినిమాతో మళ్ళీ కలిశారు. ఈ సినిమా తర్వాత ది గోట్ మూవీలో త్రిష స్పెషల్ సాంగ్ చేయడంతో త్రిష కి విజయ్ కి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అందరికీ అర్థమైంది. ఇప్పటికే త్రిష విజయ్ తలపతి ల రిలేషన్ పై సోషల్ మీడియాలో పలు రూమర్లు వినిపిస్తున్న వేళ తాజాగా త్రిషలవర్ బాయ్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి.మరి ఇంతకీ త్రిష ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం.

 త్రిష పెళ్లి అనగానే అందరూ విజయ్ తలపతి పేరే వైరల్ చేస్తున్నారు.కానీ ఆయన కాదు ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న శింబు.. ప్రస్తుతం శింబు, త్రిష ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.త్రిష శింబు ఇద్దరు మళ్లీ ప్రేమలో పడ్డారని, పాత ప్రేమ మళ్ళీ కొత్తగా చిగురించింది అని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వీరి ఫోటోల కింద నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి కనిపించడానికి కారణం కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ. ఈ సినిమాలో కమల్ హాసన్ తో త్రిష హీరోయిన్ గా నటించగా శింబు ఓ కీలక పాత్రలో నటించారు.

అలా  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. ఇందులో భాగంగా త్రిష శింబు కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ అవ్వడంతో మళ్ళీ త్రిష,శింబుల పెళ్లి ప్రేమ వార్తలపై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శింబు తండ్రి కూడా గతంలో మా కొడుకు పెళ్లి త్వరలోనే జరగబోతుంది అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. మరి నిజంగానే శింబు త్రిషలు పెళ్లి బంధంతో ఒక్కటవుతారా.. లేదా ఇవి కోలీవుడ్లో వినిపించే రూమర్ లేనా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: