
గతంలో మహేష్ ,ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. అయితే అవన్నీ కూడా సింగపూర్ ,దుబాయ్ మ్యూజియంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రధానమైన లండన్ మ్యూజియంలో ఇప్పుడు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని సైతం ఆవిష్కరించబోతున్నారట. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మెగా కుటుంబ సభ్యులతో పాటుగా రామ్ చరణ్ భార్య, కూతురు కూడా లండన్ కి బయలుదేరి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ మైనపు విగ్రహంతో పాటుగా రామ్ చరణ్ పెంచుకునేటువంటి జంతువు రైమ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట.
వాస్తవానికి సోషల్ మీడియాలో కూడా రైమ్ కి మంచి క్రేజీ ఉన్నది. రామ్ చరణ్ టీమ్ ఎప్పటికప్పుడు తన పెంచుకొనే రైమ్ ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. మొత్తానికి మెగా కుటుంబం మొత్తం కూడా లండన్ కి బయలుదేరి అక్కడ వ్యాక్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించుకొనే కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని మరి తిరిగి బయలుదేరి రాబోతున్నట్లు సమాచారం. మే 9వ తేదీన సాయంత్రం లండన్ లో ఈ కార్యక్రమం జరగబోతోందట.6: 15 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగబోతున్నట్లు వినిపిస్తోంది. ఈ ఏడాది మొదటిలో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన రామ్ చరణ్ భారీ ఫ్లాప్ ను మూట కట్టుకున్నారు.. దీంతో తన తదుపరిచిత్రం పెద్ది పైన హైప్స్ భారీగా పెరిగేలా చేశారు రామ్ చరణ్.