క్యాస్టింగ్ కౌచ్ పై చాలామంది హీరోయిన్లు బయటికి వచ్చి నోరు విప్పి ఇండస్ట్రీలో ఉన్న చీకటి బాగోతాలు బయటపెట్టారు. అయితే చాలామంది బాలీవుడ్ లోనే ఎక్కువ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అనుకుంటారు. కానీ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఈ క్యాస్టింగ్ కౌచ్ భూతం ఉంది. చాలామంది హీరోయిన్లు,సింగర్లు, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డవారే.. అలా లెక్కకు మించి హీరోయిన్లు,క్యారెక్టర్ ఆర్టిస్టులు,లేడి సింగర్లు బయటికి వచ్చి ఎంతోమంది బాగోతాలు బయటపెట్టారు. ముఖ్యంగా కొన్ని ఇండస్ట్రీ లలో కమిటీలు స్ట్రిట్ గా ఉన్నా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు పేర్లతో సహా బయట పెడుతూ ఇండస్ట్రీలో రచ్చ సృష్టిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కన్నడ నటి కస్తూరి శంకర్ ఆ డైరెక్టర్ నన్ను పక్కలోకి రమ్మన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ఇక కస్తూరి శంకర్ అంటే తెలియని వారు ఉండరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు, కన్నడ,మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలా అక్కినేని నాగార్జున నటించిన భక్తిరస సినిమా అయినటువంటి అన్నమయ్య మూవీలో నాగార్జున భార్య పాత్రలో నటించింది. అలా రమ్యకృష్ణతో పాటు కస్తూరి కూడా నాగార్జున భార్య పాత్రలో నటించింది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలోనే  కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉంది.అయితే నేను ఓ సినిమా ఆడిషన్ కోసం వెళ్ళినప్పుడు దర్శకుడు నన్ను పిలిచి అవకాశం ఇస్తా కానీ నువ్వు ఒక రోజు నాతో పడుకోవాలి అని చెప్పారు.

అయితే దానికి నేను ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా నుండి నన్ను హీరయిన్ గా తీసేశారు. ఆయన కూడా నేను పెద్దగా బాధపడలేదు. అలాంటి చెత్త పని చేయడం కంటే సినిమా వదిలేసుకోవడం మేలు అనుకున్నాను అంటూ కన్నడ నటి కస్తూరి శంకర్ చెప్పుకొచ్చింది. ఇక కన్నడ నటి కస్తూరి శంకర్ ఏదైనా సరే చాలా ఓపెన్ గా మాట్లాడుతుంది.క్యాస్టింగ్ కౌచ్ తో పాటు ఎన్నో వివాదాల్లో ఈ హీరోయిన్ ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ఇక సినిమా అవకాశాలు తగ్గాక బుల్లితెరపై స్టార్ మా లో ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్లో కీ రోల్ పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: