చాలా వరకు మూవీ బృందాలు భారీ క్రేజ్ ఉన్న రెండు సినిమాలను ఒకే రోజు విడుదల అవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మినహాయిస్తే అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలు కనీసం ఒక రోజు గ్యాప్ లో కూడా విడుదల కాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఒకే రోజు లేదా ఒకటి , రెండు రోజుల గ్యాప్ లో రెండు భారీ క్రేజీ సినిమాలు విడుదల అయినట్లయితే ఆ సినిమాలకు థియేటర్లను అడ్జస్ట్ చేయడం నిర్మాతలకు కష్టం అవుతుంది.

ఒక వేళ ధియేటర్లను అడ్జస్ట్ చేసి సినిమాను విడుదల చేసిన ఏ మూవీ కి కాస్త నెగిటివ్ టాక్ వచ్చిన కూడా ఆ సినిమాకు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కారణంతో భారీ క్రేజ్ కలిగిన సినిమాల విడుదల మధ్య నిర్మాతలు కనీసం ఒక వారం గ్యాప్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం మంచి క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు విడుదల అవుతూ ఉంటాయి. ఇకపోతే ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా కుబేర అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ "సితారే జమీన్ పర్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

మూవీ ని కూడా ఈ సంవత్సరం జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కుబేర , సితారే జామిన్ పర్ ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు విడుదల కానున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: