
అయితే నిజానికి అమీర్ ఖాన్ కోసం అనుకున్న పాత్ర ఆయన చేయాల్సింది కాదట. ఆ పాత్రలో ముందుగా అక్షయ్ కుమార్ ను అనుకున్నారట . అట్లీ కూడా అక్షయ్ కుమార్ తోనే ఫైనలైజ్ చేయాలి ఈ రోల్ అంటూ ఫిక్స్ అయ్యారట . కానీ బన్నీ మాత్రం అందుకు నిరాకరించారట . అక్షయ్ కుమార్ కాకుండా ఈ మూవీలో అమీర్ ఖాన్ అయితే చాలా చాలా బాగుంటుంది సినిమాకి భారీ హైప్ వస్తుంది అంటూ అక్షయ్ కుమార్ ప్లస్ ని అమీర్ ఖాన్ తో రీప్లేస్ చేయించాడట. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.
ఎందుకు అల్లు అర్జున్ - అక్షయ్ కుమార్ ని వద్దన్నాడు..? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా ..? అంటూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. బన్నీని అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. మొత్తానికి బన్నీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆయనను దుమ్మెత్తి పోసేలా చేస్తుంది. అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ బన్నీపై మండిపడుతూ ఉంటే అమీర్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో బన్నీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి అట్లీ డైరెక్షన్లో తెరకెక్కే సినిమాతో బన్నీ ఏదో ప్రూవ్ చేయాలి అంటూ బాగా డిసైడ్ అయినట్లున్నాడు అని ఈజీగా అర్థమయిపోతుంది..!