కాంతార ఒక చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయి లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2022 లో రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డులు కొల్లగొట్టిందని చెప్పవచ్చు.. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు.. ఇందులో కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా రెండవ భాగం సినిమా షూటింగ్ జరుగుతోంది. కానీ ఎప్పుడైతే షూటింగ్ ప్రారంభమైందో అప్పటినుంచి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా ఉడిపి జిల్లా కొల్లూరు దగ్గర షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రాని కి జూనియర్ ఆర్టిస్ట్ గా కేరళ కు చెందినటువంటి కపిల్ చేస్తున్నాడు. అయితే మంగళవారం రోజు చిత్రీకరణ పూర్తి చేసుకొని  కపిల్ ఆ పక్కనే ఉన్నటువంటి సౌపర్నికా అనే నదిలో ఈతకు వెళ్లాడు. 

లోతు ఎక్కువగా ఉండడంతో ఆ నీటి లోనే మునిగి మరణించాడు. ఇదే కాకుండా కొన్ని రోజుల క్రితం సినిమా ఆర్టిస్టులతో వెళుతున్నటువంటి వ్యాను బోల్తా పడింది. అలాగే భారీ ఖర్చు తో నిర్మించిన ఒక సెట్ గాలి వాన కు పూర్తిగా దంసమైంది. ఈ విధంగా సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అడుగడుగునా ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలం లోనే పంజుర్లీ దేవాలయానికి హీరో రిషబ్ శెట్టి వెళ్లినప్పుడు  నువ్వు ప్రమాదం లో ఉన్నావ్ నీ చుట్టు పక్కల వాళ్ళ దగ్గర నుంచి ఇది పొంచి ఉందని చెప్పుకొచ్చింది.

అక్కడ పంజూర్లి దేవత ఏదైతే చెప్పిందో  ఆ విధంగానే ఈ సినిమా షూటింగ్  లో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చిత్ర యూనిట్ వారు షూటింగ్లో పాల్గొనాలంటేనే భయపడిపోతున్నారు. మరి చూడాలి ఈ షూటింగ్ పూర్తి అయ్యే సరికి ఇంకెన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: