మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... జగపతి బాబు ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ  , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు  ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితం మేకర్స్ ఓ వీడియోని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన వీడియో అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఉప్పెన మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకున్న బుచ్చిబాబు ప్రస్తుతం చరణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక బుచ్చిబాబు తన తదుపరి మూవీ ని కూడా ఇప్పటికే సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు తన తదుపరి మూవీ ని ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నట్లు , ప్రస్తుతం బుచ్చిబాబు , మహేష్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు అన్ని ఓకే అయితే మహేష్ , బుచ్చిబాబు కాంబోలో ఓ మూవీ ఉండే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: