కొన్ని రోజుల క్రితం కొంత మంది ఉగ్రవాదులు అమాయకమైన ఎంతో మంది భారతీయులను చంపివేసిన విషయం మన అందరికీ తెలిసిందే. వీరంతా పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదులు అని తెలిసింది. దానితో భారత ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నట్లయితే ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయి భారత్ పై మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంటుంది అని , దానితో అలాంటి దాడులకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించాలి అనే ఉద్దేశంతో భారత్ ఆర్మీ వారిపై నిన్న రాత్రి నుండి దాడులు చేయడం మొదలు పెట్టింది. దానితో భారత ఆర్మీ ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించిన అనేక మంది ఉగ్రవాదులను తుద ముట్టించింది.

ఇక చాలా సందర్భాలలో భారత్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఆ ఉగ్రవాదులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. వారికి మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. వారిని మేము రక్షించడం లేదు అని స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దానితో వారు కూడా ఏదేచ్ఛగా పాకిస్తాన్ లో తలదాచుకుంటూ భారత పై అనేక సార్లు ఉగ్రదాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితం భారత్ ప్రజలపై దాడి జరగడం దాని ద్వారా అనేక మంది మరణించడంతో భారత ప్రభుత్వం దానిని చాలా సీరియస్ గా తీసుకొని ఒక్క సారిగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై మెరుపు దాడి చేసి వారిని తుద ముట్టించింది.

దానితో ప్రస్తుతం పాక్ షాక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపై ఎప్పుడు కూడా భారత్ పై ఎవరి పేరు చెప్పి పాకిస్తాన్ ఉగ్రదాడులను చేసినా కూడా భారత్ ఇదే స్థాయిలో రెచ్చిపోతుంది అని వారికి అర్థమయింది అని , దానితో ఇకపై భారత పై దాడి చేయాలి అంటే పాకిస్తాన్ గజ గజ వనికి పోతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: